7 August, 2026 | 2:30 AM

ఘనంగా గ్రాడ్యుయేషన్‌డే వేడుకలు

07-08-2026 12:00 AM

మేడ్చల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి పరిధిలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో 2026 లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ సీనియర్ సి ఎస్ ఈ ప్రొఫెసర్ అండ్ రెక్టర్ డా. ఆవుల దామోదరం, గౌరవ అతిథిగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కో-ఆర్డినేటర్ డా. శ్రీదేవి హజరయ్యారు.

ఈ సందర్భంగా డా. ఆవుల దామోదరం మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిగ్రీ కేవలం సర్టిఫికేట్ కాదని, సమాజానికి సేవ చేసే బాధ్యత అని విద్యార్థులకు గుర్తు చేశారు. కష్టపడి నేర్చుకుని, నైతిక విలువలతో కొత్త టెక్నాలజీలను సృష్టించాలని సూచించారు. శ్రీదేవి మాట్లాడుతూ.. ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అమ్మాయిలు సహా అందరూ రాణించాలని అన్నారు. నిరంతరం నేర్చుకునే మనస్త త్వంతో భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చే ధించాలని ఆకాంక్షించారు. కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ నేర్చుకున్న జ్ఞానం, క్రమశిక్షణతో దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, ఎప్పుడూ కళాశాల విలువలను నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు.