08-12-2025 01:33:04 AM
ఏకంగా 30 మందికి పైగా దాడి
ఆమనగల్లు, డిసెంబర్ 7(విజయ క్రాంతి): ఆమనగల్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం సాయంత్రం వీధి కుక్క రోడ్డుపైన కనిపించిన వారి పైన దాడి చేసి అందరిని బెంబేలెత్తించింది. పట్టణ సమీపంలోని మేడిగడ్డ హైవే నుంచి విఠాయిపల్లి వరకు నడుచుకుంటూ వెళుతున్న వారి పై దాడి చేసి గాయపరించిది..... ఒకరు ఇద్దరు అయితే ఏమో అనుకోవచ్చు దాదాపుగా 30 మంది ఆ కుక్క బారిన పడ్డారు.
దీంతో ఆమనగల్ పట్టణంలో కుక్క కనిపిస్తే చాలు పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. కుక్క బారిన పడిన వారంతా బాధితులందరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీసి చికిత్స పొందారు. కుక్క బారిన పడిన ఒకరి తర్వాత ఒక మరొకరు బాధితులు రావడంతో దావకాలలో చికిత్స చేసే వైద్య సిబ్బంది సైతం ఆందోళన గురయ్యారు. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి బాధితులకు అందరికీ ప్రథమ చికిత్స నిర్వహించారు.