05-10-2025 01:00:53 AM
భారతదేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒకరికి బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. అంటే ఒక్కరోజు ముగిసేలోపే దాదాపు 330 కుటుంబాలు ఈ షాక్‌ను ఎదుర్కొంటున్నాయి. కానీ సకాలంలో అవగాహన, సరైన చికిత్సతో ప్రాణాలను రక్షించవచ్చు. మన శరీరానికి రక్తం జీవన ప్రవాహంలా పనిచేస్తుంది. ఇది శరీరానికి ఆక్సిజన్, పోషకాలు, రక్షణ కణాలను అందిస్తుంది. బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో తప్పుడు కణాలు పెరిగి శరీర వ్యవస్థను దెబ్బతీస్తాయి.
బ్లడ్ క్యాన్సర్‌లో ప్రధాన రకాలు
లుకేమియా: బ్లడ్, బోన్ మారోలో ఏర్పడే క్యాన్సర్
లింఫోమా: శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్
మైలొమా: ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్లాస్మా కణాల్లో ఏర్పడే క్యాన్సర్
భారతదేశంలో గణాంకాలు
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,20,000 మందికి పైగా కొత్తగా బ్లడ్ క్యాన్సర్ కేసులు గుర్తించబడుతున్నాయి. వారిలో 70,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అందులో లుకేమియా కేసులు సుమారు 50,000, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా సుమారు 40,000, హాడ్జ్కిన్ లింఫోమా సుమారు 10,000 ఉంటున్నాయి. ఇది పెద్దవారికే కాదు, పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది పిల్లలు (019 సంవత్సరాలు) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారిలో చాలా మంది లుకేమియా రోగులు.
చికిత్సల ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు
భారతదేశంలో ఐదు సంవత్సరాల జీవన శాతం కేవలం 30% మాత్రమే. ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. అయితే, స్టెమ్ సెల్ లేదా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సల ద్వారా 60 వరకు ప్రాణాలను కాపాడవచ్చు. కానీ దేశంలో డోనర్ల కొరత ఉంది. జనాభాలో 0.1% కన్నా తక్కువ మంది మాత్రమే రిజిస్టర్డ్ డోనర్లు. కుటుంబంలో సరిపడే డోనర్ దొరకని వారు 70 శాతం వరకు ఉన్నారు. అందుకే ప్రజల్లో అవగాహన, డోనర్ ప్రోగ్రామ్లలో పాల్గొనడం అత్యవసరం.
సంభవించే కారణాలు
బ్లడ్ క్యాన్సర్‌కు ఒక్క కారణం అంటూ ఉండదు. కానీ కొన్ని అంశాలు ప్రమాదాన్ని పెంచుతాయి. కిరణాలు, రసాయనాలు, హానికర పదార్థాల ప్రభావంతోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు.
వయస్సు: చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు
కుటుంబ చరిత్ర: కుటుంబంలో ఇలాంటి రోగాలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ,
జీవనశైలి: ధూమపానం, అధిక మద్యం సేవనం
ఎలా నిర్ధారిస్తారు?
వైద్యులు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా వివిధ పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు.
బ్లడ్ టెస్టు: కణాల సంఖ్యలో తేడాలు గుర్తించడానికి
బోన్ మారో బయాప్సీ: బోన్ మారోలో అసాధారణ కణాల పెరుగుదల పరిశీలించడానికి
స్కానింగులు: క్యాన్సర్ వ్యాప్తి స్థాయిని తెలుసుకోవడానికి
జెనెటిక్/మాలిక్యులర్ పరీక్షలు: సరైన చికిత్స ఎంపిక కోసం జన్యు మార్పులను గుర్తించడానికి
ప్రతి రోగికి ప్రత్యేక చికిత్స
బ్లడ్ క్యాన్సర్‌కు ఒకే రకమైన చికిత్స ఉండదు. రకం, దశ, వయస్సు, ఆరోగ్య స్థితి ఆధారంగా వైద్యులు వ్యక్తిగత ప్రణాళిక రూపొందిస్తారు.
ప్రధాన చికిత్సలు
పరీశీలన, పర్యవేక్షణ: ప్రారంభ దశల్లో కేవలం పర్యవేక్షణ.
కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను నాశనం చేసే మందులు.
రేడియేషన్ థెరపీ: ఎనర్జీ బీమ్లతో కణాలను లక్ష్యంగా చేసుకోవడం.
టార్గెటెడ్ థెరపీ: క్యాన్సర్ కణాలపై మాత్రమే పనిచేసే ఆధునిక మందులు
ఇమ్యూనో థెరపీ: శరీర రోగనిరోధక శక్తిని పెంచడం.
బోన్ మ్యారో/స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్: దెబ్బతిన్న కణాలను ఆరోగ్యకరమైన కణాలతో భర్తీ చేయడం.
ఇవి లక్షణాలు
బ్లడ్ క్యాన్సర్ తొలిదశల్లో పెద్దగా గుర్తించలేము. కానీ ఇవి ఉంటే జాగ్రత్తగా పరిశీలించాలి. ఎంత విశ్రాంతి తీ సుకున్నా అలసటగా ఉండటం, ఎక్కువ రోజులుగా జ్వరం, చలి, రాత్రిళ్లు చెమటలు పడటం, తరచూ ఇన్ఫెక్షన్లు రావ డం, బరువు తగ్గడం, మెడ, భుజం కిం ద లేదా తొడ వద్ద వాపు, సులభంగా గాయాలు, రక్తస్రావం, ఊపిరి తిత్తులు లేదా ఛాతీలో భారంగా అనిపించడం.
స్టార్ హాస్పిటల్స్ ముందంజ
స్టార్ హాస్పిటల్స్ బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో దేశంలో అగ్రగామిగా ఉంది. అత్యాధునిక బ్లడ్ టెస్టులు, బోన్ మారో బయాప్సీలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, జెనెటిక్ ప్రొఫైలిం గ్లతో ఖచ్చితమైన నిర్ధారణ అందిస్తోంది. వైద్య నిపుణుల బృందం ప్రతి రోగికి ప్రత్యేక చికిత్స ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, లేదా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా సమగ్ర సంరక్షణ అందిస్తోంది. రోగులు మళ్లీ బలాన్ని, ఆశను, జీవన నాణ్యతను పొందేలా స్టార్ హాస్పిటల్స్ అంకితభావంతో పనిచేస్తోంది.