calender_icon.png 12 September, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

12-09-2025 07:21:56 PM

29వ సార్లు రక్తదానం చేసిన సామాజికవేత్త బాబు నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సామాజికవేత్త బాబు నాయక్ అన్నారు.మండలంలోని తన స్వగ్రామైన గార కుంట తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగేశ్వరరావు కి ఓపెన్ హార్ట్ సర్జరీ కారణంగా బి నెగిటివ్ బ్లడ్ అవసరం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కి వెళ్లి రక్తం అందించినట్లు తెలిపారు.ఆపదలో ఉన్నవారికి ఇప్పటికీ 29 సార్లు రక్తదానం చేసినట్లు ఆయన పాత్రికేయులకు తెలిపారు.బాబు నాయక్ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే నాకున్న కాళీ సమయంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేద, ధనిక, కులము, మతము అనే బేధం లేకుండా సేవ చేయడంలో తనకు తన కుటుంబానికి ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.