calender_icon.png 11 May, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫెనామ్’ ఆధ్వర్యంలో రక్తదానం, ఆహారదానం

11-05-2025 01:16:25 AM

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): సమాజ సేవలో భాగంగా గ్లోబల్ ఏఐ దిగ్గ జం ఫెనామ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంస్థకు చెందిన ఫెనామ్ కేర్స్, బాయిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో శనివారం రక్తదానం, ఆహారదానం కార్యక్రమాలు నిర్వహించా యి.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌తో భాగస్వామ్యంలో ఫెనామ్‌కు చెందిన 150 మందికి పైగా ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫెనామ్ ఇండియా హెచ్‌ఆర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పిండీ మాట్లాడుతూ.. ఫెనామ్‌లో ఉద్యోగులే తమ బలమన్నారు. వారి మానవత్వం, స్పం దన తమకు గర్వకారణమన్నారు.

వ్యాపార ప్రయోజనాలతో పాటు సమాజ సేవలోనూ భాగస్వాములం కావాలన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహకారంతో హైదరాబాద్‌లోని ఏడు నిరుపేద ప్రాంతాలతో పాటు బసవతారకం ఆసుపత్రి లో 2,000కి పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. విశాఖపట్నంలోనూ ఇదే తరహా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.