11-05-2025 01:17:44 AM
దిల్‌సుఖ్‌నగర్, మే 10: దిల్‌సుఖ్‌నగర్‌లోని లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్‌లో శనివా రం మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మొదటి గురువు, శాశ్వత మార్గదర్శకురాలిగా నిలిచే తల్లుల మహిమ ను తిలకిస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ బృందం కలిసి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు.
విద్యార్థులు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, భావప్రధానమైన నృత్యా లు, సంగీత ప్రదర్శనలు తల్లుల మనసులను హత్తుకున్నాయి. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా, ప్రగతిశీల విద్యార్థులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాతృదినోత్సవ శుభాకాంక్షల కార్డును విద్యారత్న లయన్ డాక్టర్ కొమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్, కోమటిరెడ్డి మంజులరాణి, డైరెక్టర్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్స్ వారికి అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి జీవితంలో తొలి పాఠశాల తల్లి అని చెప్పారు. తల్లుల ప్రేమ, త్యాగం, మార్గదర్శనం మన సమాజాన్ని నిర్మించే పునాది అని స్పష్టంగా తెలియజేశా రు. మంజుల రాణి మాట్లాడుతూ.. తల్లుల గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులు తమ తల్లులకు హృదయాన్ని హత్తుకునే సం దేశాలు అందిస్తూ ప్రేమానురాగాలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో విప్ మాధవి, ఇన్ చార్జి బజాజ్, టీచర్లు పాల్గొన్నారు.