05-09-2025 06:59:10 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పదని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినo పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక యంబి గార్డెన్ లో మర్కజే మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని, నేటి యువత సమహమ్మద్ ప్రవక్త మార్గం ఎంచుకొని సన్మార్గంలో నడచి కన్న తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది వరకు రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లతో పాటు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు, మౌలానా అజీముద్దీన్, మిలాద్ కమిటీ అధ్యక్షులు రఫీ ఉల్లా ఖాన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ సల్లావుద్దీన్ ఖాదిరి, మాజీ కౌన్సిలర్ తబ్రేజ్ ఖాన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మానసిక వికలాంగుల కేంద్రాల్లో పండ్లు పంపిణీ
మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని స్థానిక మర్కజే మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.