calender_icon.png 5 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

05-09-2025 07:01:45 PM

రాజంపేట,(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుడి తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుడి తండాకు చెందిన ధరా వాట్ స్రవంతి( 23) ఈనెల 2న భర్తతో గొడవపడి గడ్డి మందు సేవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ స్రవంతి  గురువారం రాత్రి మృతి చెందినట్లు రాజంపేట పోలీసులు తెలిపారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.