calender_icon.png 5 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బాలయోగికి ఉత్తమ లెక్చరర్ అవార్డు

05-09-2025 06:55:40 PM

భద్రాచలం,(విజయక్రాంతి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం తోటమల్ల బాలయోగికి ఉత్తమ లెక్చరర్ పురస్కారాన్ని అందజేసింది. స్థానిక టీఎస్ టూరిజం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు బాలయోగిని రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి వరలక్ష్మి ఆధ్వర్యంలో రోటరీ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. బాలయోగి ప్రస్తుతం భద్రాచలం గిరిజన గురుకుల కళాశాలలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 

గతంలో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 ఏళ్ల పాటు హిస్టరీ / సివిక్స్ లెక్చరర్ గా, భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5 ఏళ్ల పాటు హిస్టరీ లెక్చరర్ గా, భద్రాచలం మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో  ఐదేళ్లపాటు లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేశారు. దాదాపు పాతికేళ్ల పాటు విద్యారంగంలో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను తోటమల్ల బాలయోగికి ఈ పురస్కారం లభించింది.

తన అపార అనుభవంతో  విద్యార్థులకు నాణ్యమైన విద్య  అందించడంతోపాటు విద్యాలయాల ప్రగతికి కూడా బాలయోగి విశేషమైన సేవలు అందించారు. బాలయోగి ప్రత్యేక అవార్డు పట్ల భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. పద్మావతి, కళాశాల టీచింగ్,నాన్ టీచింగ్ స్టాప్ తదితరులు ఈ సందర్భంగా  అభినందించారు.