05-09-2025 08:57:29 PM
హైదరాబాద్: వనస్థలిపురం గ్రీన్ మేడోస్ అపార్ట్మెంట్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన లడ్డు వేలం పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిలకపాటి జోషిత శ్రీ చందన్ గారు లడ్డు వేలంలో ఒక లక్ష 50 వేల రూపాయలు వేలంపాడి గణేశుని లడ్డును సొంతం చేసుకున్నారు.
జానకి వాసుదేవ రావు దంపతుల గారు పట్టు వస్త్రాలను వేలం పాటలో 85500 రూపాయలు వేలం పాడి గణేశుని పట్టు వస్త్రాలను సొంతం చేసుకున్నారు. లక్ష్మి వేణు దంపతులు గారు కలశంబు వేలం పాటలో 35500 రూపాయలు వేలం పాడి గణేశుని కలషంబు సొంతం చేసుకున్నారు. పద్మ కృష్ణ రావు దంపతులు గారు మనీ మాలను వేలం పాటలో 41000 రూపాయలు వేలం పాడి గణేశుని మనీ మాలను సొంతం చేసుకున్నారు. ఇది భక్తి, సమాజ సేవ, మరియు ఉత్సవాల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం.
ఈ కార్యక్రమంలో గ్రీన్ మెడోస్ అపార్ట్మెంట్స్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు, జెనరల్ సెక్రెటరీ నిమ్మగడ్డ నాగేంద్ర రావు గారు, వైస్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటీరి భాస్కర్ రెడ్డి గారు, ట్రెజరార్ రజిత గారు, ఎక్సుక్యుటీవ్ మెంబెర్స్ కృష్ణ రెడ్డి గారు , ఉపేందర్ రెడ్డి గారు , శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు , శ్రీకాంత్ గారు , సూర్య గారు, రంగా రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు తదితరులు పాల్గొని ఈ వేడుకను మరింత ఘనతతో నిర్వహించారు. ఈ ఉత్సవం మన ఐక్యతకు, మన సంప్రదాయాలకు, మరియు భక్తి భావనకు ప్రతిరూపంగా నిలిచింది.
జై బోలో గణేశా!