15-05-2025 01:40:24 AM
నేలకొండపల్లి ఎస్‌ఐ సంతోష్..
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పంచాయతీ కార్యదర్శి భాషా..
నీ తోడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
వైరా, మే 14 (విజయక్రాంతి ): ఆపదలో ఉన్న రక్త అవసరత కలిగిన వారికి రక్తదానం చేస్తున్న రక్తదాతలే ప్రాణదాతలని నేలకొండపల్లి ఎస్త్స్ర సంతోష్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం ప్రభుత్వ పాఠశాలలో నీ తోడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిర్రని పంచాయతీ కార్యదర్శి భాషా ప్రారంభించారు. ఏ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నీ తోడు వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు నందిగామ మనోహర్ అధ్యక్షత వహించారు.ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులను ఆయన అభినందించారు. యువకుల్లో చైతన్యాన్ని నింపి రక్త అవసరతఫై అవగాహన కల్పించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన చెరువు మాదారం గ్రామానికి చెందిన నీ తోడు వెల్ఫేర్ సొసైటీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి వూటుకూరి రమేష్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరెందరికో రక్త సాయం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్త్స్ర కోరారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన రక్త దాతలకు సర్టిఫికెట్లను ఎస్‌ఐ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జె సీతారాములు, కానిస్టేబుల్ వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.