02-09-2025 12:56:31 PM
చిట్యాల (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రాత్రనకా పగలనకా విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అదను దాటుతున్న పంటకు వేసేందుకు యూరియా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు సేవా సమితి కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరి నిరీక్షిస్తున్నారు. మండల కేంద్రానికి ఒక లోడు యూరియా మాత్రమే రాగ అంతకుమించి రైతులు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. వ్యవసాయ పనులు మానుకుని రైతులు కేంద్రం వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియాను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.