calender_icon.png 2 September, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వినాయకుడికి ప్రత్యేక పూజలు

02-09-2025 12:58:15 PM

పాల్గొన్న మంత్రి వివేక్ వెంకట స్వామి..

చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మంగళవారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన గణనాధుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ఏకతా, సత్సంకల్పాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధి మెరుగుపడాలని, పంటలు బాగా పండాలని, ప్రతి ఇంటా ఆనందం నిండాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు.