02-09-2025 01:01:24 PM
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్(Saifabad Police Station)లో నమోదైన కేసు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో సైఫాబాద్ పీఎస్ లో రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పీపీ నాగేశ్వరరావుకు హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.