02-09-2025 01:10:36 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) మంగళవారం విచారణ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station) లో నమోదైన కేసు కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సృజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పీపీకి ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వచ్చేనెల 9వ తేదీకి వాయిదా వేసింది.