02-09-2025 12:54:36 PM
బురదమయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రహదారి
కోదాడ: కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మంగళవారం పర్యటించనున్నారు. క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో మంత్రి చేతుల మీదగా ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం శంకుస్థాపన ప్రారంభం కానుంది. మంత్రి వస్తున్నారని మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారికి మరమ్మతులు హడావిడిగా చేస్తున్నారు. ప్రతిరోజు గుంతలున్న పట్టించుకోని అధికారులు మంత్రి రాకతో కనీస సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే రహదారిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ సిఐ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలు ఉన్నాయి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా శాశ్వతంగా రహదారి నిర్మాణం జరపాలని పట్టణ ప్రజలతో పాటు వివిధ మండల ప్రజలు కోరుతున్నారు.