15-05-2025 01:41:34 AM
8 సెల్ఫోన్లు, కారు స్వాధీనం
చేవెళ్ల , మే 14 : పేకాట ఆడుతున్న 8 మంది పట్టుబడిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేష న్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులోని ఫామ్ ల్యాండ్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ జోన్ సీఐ అంజయ్య, ఎస్‌ఐలు రవికుమార్, రాజశేఖర్ రెడ్డిల బృందం దాడులు నిర్వహించి పేకాడుతున్న 8మందిని పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో గెలిచిన వారికి మొత్తం రూ.2 లక్షల 41 వేల నగదు ఆన్లైన్లో లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.