calender_icon.png 2 September, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పంటలను పరిశీలించిన మంత్రి

02-09-2025 01:00:49 PM

వరదతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

మంత్రి వివేక్ వెంకట స్వామి..

చెన్నూర్ (విజయక్రాంతి): ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో వచ్చిన గోదావరి నది వరదతో నష్టపోయిన పంట పొలాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)తో కలిసి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పరిశీలించారు. చెన్నూరు మండలంలోని సుందరశాల, నాగాపూర్, సోమనపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, సుమారు 200 ఎకరాల పంట దెబ్బతిందని, పంట కోసం పెట్టిన ఖర్చులు వృథా కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మంత్రికి విన్నవించారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పంట నష్టం వివరాలపై ఖచ్చితమైన నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.