calender_icon.png 4 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత..

04-10-2025 08:15:44 PM

చిట్యాల (విజయక్రాంతి): నార్కట్ పల్లి మండలం జువ్వగూడంలో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను అధికారులు సిబ్బందితో వెలికి తీశారు. మృతులను నార్కట్ పల్లికి చెందిన నల్గొండ రిషిక్(17), చౌటుప్పల్ చెందిన పోలోజు హర్షవర్ధన్(17)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.