04-10-2025 08:10:19 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఇటీవలే పరమపదించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు రవీందర్ రెడ్డి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి తన అభిమానాన్ని, అనుభవాన్ని, ఆప్యాయతను పంచుకున్నాడు. ఆ మహనీయుడు లేని లోటు తీరనిదని, దామోదర రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాయిని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.