గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం
పాపన్నపేట, మే 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న చెక్డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు ఫ్రెంచ్కట్ గడ్డంతో, రెండు జతల బట్టలున్న బ్యాగుతో ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం కోసం వచ్చినట్లు తెలుస్తోందన్నారు. చెక్డ్యాం వద్ద స్నానం చేయ డానికి నీటిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సమాచారం.
చెక్డ్యాం ఒడ్డున బట్టలు, బ్యాగు కనిపించడం తో అనుమానం చెందిన స్థానికులు వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గజఈతగాళ్ల సహాయంతో మృతదే హాన్ని వెలికి తీశారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి ఫోటో ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ 87126 57920, మెదక్ రూరల్ సీఐ 87126 57916లను సంప్రదించాలని పోలీసులు కోరారు.






