26 May, 2026 | 1:55 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం

26-05-2026 12:00 AM

మహబూబ్‌నగర్ అర్బన్‌లో పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ  

మహబూబ్‌నగర్, మే 25(విజయక్రాంతి ): మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం - 2026 సీజన్ కోసం 50 శాతం సబ్సిడీ (సగం ధరకే) పై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో మేయర్ మమత శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ ఎం.సు రేందర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ శేఖర్ చేతుల మీదుగా పచ్చి రొట్టె విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

భూసారాన్ని పెంపొదించే , ఈ విత్తనాలను రైతులందరికి ప్రభుత్వం సబ్సిడీపై సగం ధరకే అందిస్తోందని తెలియజేశారు. సబ్సిడీ పై రైతులకు జీలుగ విత్తనాల బస్తా (30 కిలోలు): అసలు ధర రూ. 2,452.50 (దీనిపై 50% రాయితీ ఉం టుంది). జనుము విత్తనాల బస్తా (40 కిలోలు): అసలు ధర రూ. 3,110 (దీనిపై 50% రాయితీ ఉంటుంది). ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను, విత్తనాలను, ఇతర ఎన్నో పథకాలను రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తోందని తెలిపారు.

సబ్సిడీపై పచ్చి రొట్టె ఎరువు విత్తనాలను ఇవ్వటం వలన రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకొని, భూసారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి.శ్రీనివాసులు, ఏఈవోలు నవీన్, సునీత, స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.