29-10-2025 11:42:28 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad district) తుఫాన్ కారణంగా భారీ వర్షం కురుస్తోంది. డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి వర్షం నీరు ప్రవహిస్తుండడంతో గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే మహబూబాబాద్ లో ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలిపివేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి.