calender_icon.png 29 October, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రవర్ణాల దోపిడీ పాలన అంతం కావాలంటే ఆర్‌ఎల్‌డిలో చేరండి

29-10-2025 12:43:21 PM

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

 హన్మకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యకులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ "సామాజిక చైతన్య రథయాత్ర" వరంగల్ కు చేరుకుంది. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలం లో బీసీల చైతన్యం పెల్లుబికి వచ్చింది అని అగ్ర వర్ణాల దోపిడీ పాలనను అంతం మొందించాలంటే ఈ వర్గాల ప్రజలు SC, ST లతో జత కట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ వర్గాల సంక్షేమ విషయం లో బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ దొందు దొందే, అదొక పద్ధతి లో దొరల పాలన అయితే కాంగ్రెస్ ది ఇంకొక పద్ధతి లో దోపిడీ విధానం అన్నారు. సమిష్టి గా ఇద్దరు తెలంగాణ ను దోచుకుని తిన్న వాళ్లే అని అన్నారు.

420 ఎలక్షన్ హామీలను ఇచ్చి అధికారాన్ని చేబీకించుకున్న కాంగ్రెస్ చేసింది ఏంటో చేయంది ఏంటో, శ్వేత పత్రం ద్వారా ప్రజల ముందు ఉండాలి అని అన్నారు. మన స్థానిక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల సీఎం వ్యవహార శైలిని ఆమె కుమార్తె నే స్వయం గా ఎండగట్టారు. ఈ పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ లకు ముఖ్యంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఆర్.ఎల్.డి డిమాండ్ చేస్తోంది అన్నారు. స్వయంగా కొండ సురేఖ గారే చెప్పినట్లు గా ఈ మంత్రి వర్గం లో ఉన్న కమిషన్లకు కక్కుర్తి పడుతున్న మంత్రులను సీఎం తక్షణమే కాబినెట్ నుంచి తొలగించాలి అని అన్నారు. లేకపోతే వీరి బర్తరఫ్ కు ఆర్.ఎల్.డి గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తుందని,సదా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎవరు అవినీతి మంత్రులో తెలియక పోతే, మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే ఆర్.ఎల్.డి స్వయం గా ఆ పేర్లను ఆధారాల తో సహా అందిస్తుందని, అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజిక తెలంగాణగా మార్చవలసిన చారిత్రక అవసరం ఉంది అన్నారు.

బి సి వర్గాలు ఇతర పార్టీలలో సీట్లు సాధించలేక పోతే ఆర్.ఎల్.డి వీరికి 80% సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉందని, రాజకీయాల పట్ల ఏవగింపు ఉన్న సమర్థులైన యువత రాజకీయాలలోకి రావాలి, సామాజిక తెలంగాణను ఏలుకోవాలి అని అన్నారు. యువత సాధికారత కోసం ఆర్ఎల్డి తరుపున జాబ్ మేళా లను నిర్వహిస్తున్నామని, టీ.ఆర్. ఎల్.డి ఆధ్వర్యం లో నేషనల్ స్కిల్ మంత్రి ఆర్.ఎల్.డి పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్ సింగ్  సహకారం తో వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాలలో ప్రతీ మూడు నెలలకు ఒక సారి జాబ్ మేళాలు నిర్వహించి యువతకి శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. టీ.ఆర్.ఎల్.డి పార్టీకి చెందిన 'లక్ష్యం' యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ జాబ్ మేళాల వివరాలన్నీ యువత తెలుసుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు టి.ఆర్.ఎల్.డి నాయకులు, అధికార ప్రతినిధి బీరప్ప, మల్లేష్, రిషబ్ జైన్, ప్రధాన కార్యదర్శి నరసింహరావు, సుధాకర్, కొమ్ము ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.