29-10-2025 12:46:19 PM
ఎడతెరిపి లేని వర్షం, తడిసిన ధాన్యం కుప్పలు
మూసీ పరవాళ్ళు, నిలిచిపోయిన రాకపోకలు
వలిగొండ,(విజయక్రాంతి): 'మొంథా' తుఫాన్(Cyclone Montha) ప్రభావంతో వలిగొండ(Voligonda) మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తుఫాను ప్రభావంతో మూసీ ఎగువ ప్రాంతాల్లో మరియు మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ పరవాళ్ళు తొక్కుతూ సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్యగల కాజువే పైనుండి పరుగులు తీస్తుండడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.