calender_icon.png 29 October, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రాజెక్టుకు వరద తాకిడి.. ఏడు గేట్లు ఎత్తివేత

29-10-2025 12:24:47 PM

నాలుగు ఫీట్ల  పైకెత్తి 20,000 క్యూసెక్కుల నీటివిడుదల

నకిరేకల్,(విజయక్రాంతి):  హైదరాబాద్ తో పాటు  జిల్లాలో ఎరతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు(Musi project ) వరద తాకిడి పెరిగింది . ఇన్ ఫ్లో 2677.06 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి నీరు  వచ్చి చేరడంతో  బుధవారం  మూసి ప్రాజెక్ట్ అధికారులు 7 గేట్ల ద్వారా నాలుగు ఫీట్ల మేర పైకెత్తి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగాప్రస్తుతం నీటి సామర్థ్యం 4.36 టీఎంసీల నీరు చేరుకుంది.వర్షం ఇలాగే కొనసాగితే మరింత ప్రాజెక్టులోకి  ఇన్ ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.