calender_icon.png 29 October, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం ఆగిన వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి..

29-10-2025 12:30:20 PM

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి, (విజయక్రాంతి): మొంథా తుఫాన్ వల్ల కురుస్తున్న అకాల వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలు సరియైన పట్టాలు ప్రభుత్వం సప్లై చేయకపోవడం వలన తడిసి ముద్దయినా పరిస్థితి లో రైతాంగం బాధ పడుతావున్నారు. బండారామారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వం వర్షాలు ఎలిసిన మరుసటి రోజునుండే కాంటాలు ప్రారంభించి తేమశాతం తో సంభందం లేకుండా కొనుగోలు చేయాలి. మద్దతు ధర చెల్లించాలీ. ఆరుగాలం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆర్థికంగా అప్పులపాలై. సరియైన విధంగా సకాలంలో ప్రభుత్వం ఎరువులు అందించక నాన తంటాలు పడి పండించిన పంట తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోస్తే 20రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించక పోవడం. అకాల తుఫాన్ వర్షాలు రావడంతో రైతు బేంబేలు ఎత్తి దిక్కు తోచని స్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వర్షాలు ఆగిన వెంటనే కాంటాలు మొదలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నాం. అలాగే తేమశాతం తో సంభందం లేకుండ మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశం లో బిఆర్ఎస్ నాయకులు అకారపు భాస్కర్. కొల్లూరి మహేందర్. పాల్గొన్నారు.