calender_icon.png 29 October, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించండి

29-10-2025 12:28:23 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఎవ్వరికి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు(Congress workers) ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు అందుబాటులో ఉండి సహకారం అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లోతట్టు ప్రాంతంలో పురాతన ఇండ్లలో ప్రజలు ఎవరు నివాసం ఉండకూడదని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ అధికారులకు సమాచారం ఇస్తూ సమన్వయం చేయాలని కార్యకర్తలకు ఒక ప్రకటన లో సూచించారు. 

భారీ వర్షాల కారణంగా పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున, చిన్నారులను ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దన్నారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులతో సమన్వయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆదేశించారు. నీటితో నిండిన రహదారుల మీదుగా ప్రయాణాలు కొనసాగించకూడదని అధికారులు సైతం అప్రమత్తత బోర్డులు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావాలని సూచించారు.