calender_icon.png 13 October, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సంఘం జిల్లా అధ్యక్షురాలుగా 'బొలిశెట్టి భాస్కరమ్మ' ఎన్నిక ఏకగ్రీవం

13-10-2025 07:06:23 PM

పెన్ పహాడ్ : మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన  అంగన్వాడీ టీచర్  బొలిశెట్టి  భాస్కరమ్మ సూర్యాపేట జిల్లా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం  (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని  సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన  ఆసంఘం  మహాసభలో రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి  సమక్షంలో ఆమె ఎన్నికయ్యారు. ఈ  సందర్భంగా  భాస్కరమ్మ  మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్లు  హెల్పర్లు సమస్యల కోసం నిరంతరం పోరడుతూ  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యూనియన్ బలోపేతం కొరకు  అందరూ సహకరించాలని అంగన్వాడి టీచర్లను, హెల్పర్లను కోరారు.