13-10-2025 07:08:59 PM
వలిగొండ (విజయక్రాంతి): సోమవారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షంతో వలిగొండ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో పల్లెర్ల సహదేవ్ కు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. కాగా కూలిన ఇంటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి బాధిత కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం నుండి రావలసిన ఆర్ధిక సహాయం అందిస్తామని అన్నారు.