calender_icon.png 13 October, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

13-10-2025 07:05:55 PM

రైతుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా అత్యధిక వర్షం కురిసిందని అన్నారు. గడిచిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారులు రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శేఖర్ రెడ్డి, తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.