calender_icon.png 2 October, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రవాణా చేస్తున్న బాలీవుడ్ నటుడి అరెస్ట్

02-10-2025 12:17:26 AM

రూ.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

చెన్నై, అక్టోబర్ 1: బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ రవాణా చేస్తూ బుధవారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ కొన్నేళ్ల క్రితం సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్  పాటు అనేక చిత్రాల్లో నటించాడు.

విశాల్‌కు కొన్నాళ్ల నుంచి అవకాశాలు రావడం లేదు. క్రమంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో అతడికి స్నేహితుల ద్వారా నైైజీరియన్ డ్రగ్స్ రవాణా ముఠాతో పరిచయమైంది. కంబోడియా వెళ్లి, అక్కడి నుంచి భారత్‌కు మాదక ద్రవ్యాలు తీసుకొస్తే భారీ మొత్తంలో సొమ్ము చెల్లిస్తామని ముఠా ఆశజూపింది. దీంతో విశాల్ రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. అక్కడ ఓ నైజీరియన్  నుంచి మాదకద్రవ్యాలు ఉన్న బ్యాగ్ తీసుకొని, చెన్నైకి బయల్దేరాడు. ఈ క్రమంలోనే విశాల్ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డాడు.