calender_icon.png 2 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ బాబా గదిలో అశ్లీల చిత్రాల సీడీలు

02-10-2025 12:19:52 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: విద్యార్థినులను లైంగిక వేధింపుల గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ బాబా అలియాస్ స్వామి చైతన్యానంద సరస్వతి కేసు దర్యాప్తులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి గదిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చా యి. గదిలో సెక్స్ టాయ్స్, అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలు లభ్యమయ్యాయి.

అలాగే నిందితుడి మొబైల్‌లో ఓ విద్యార్థినితో అసభ్యకరంగా చాట్ చేసినట్లు, ‘ఓ దుబా య్ షేక్‌కు శృంగార భాగస్వామి కావాలి. నీకు ఎవరైనా తెలుసా ?’ అని సదరు విద్యార్థిని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే.. సదరు దుబాయ్ షేక్ ఎవరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.