13 April, 2026 | 6:11 PM

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీ..

27-10-2025 05:27 PM

పాపన్నపేట (విజయక్రాంతి): మండల కేంద్రం పాపన్నపేటలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్, ఏఎస్సై దేవిదాస్, కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.