08-05-2025 01:12:21 PM
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో గురువారం హైఅలర్ట్ ప్రకటించారు. ఇంతలో, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium)లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. జైపూర్ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. బెదిరింపులు రావడంతో స్టేడియం లోపల నుంచి అందర్నీ బయటకు పంపించి వేశారు. స్టేడియం చుట్టుపక్కల ఉన్నవారినీ జైపూర్ పోలీసులు ఖాళీ చేయించారు. బాంబు స్వ్కాడ్‌లు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం లోపల, వెలుపల గాలిస్తున్నారు.