calender_icon.png 8 May, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

08-05-2025 04:31:34 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 30వ డివిజన్ పరిధిలోని కాకతీయ జువలాజికల్ పార్క్ లోపల రూ. కోటి రూపాయలతో అంతర్గత రోడ్డు నిర్మాణం, బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఈరోజు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddyశంకుస్థాపన చేశారుఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ... జూ పార్క్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుడదని ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించమని అన్నారు. వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. రానున్న రోజుల్లో జూ పార్క్ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.