08-05-2025 05:05:41 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం ఐకెపి సెంటర్(IKP Center) లో ఓ మహిళ ట్రాక్టర్ ఫ్యాన్ తో వడ్లు పడుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల విజయ గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఫ్యాన్ వేసి వడ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు తన ఎడమ చేయి మోకీలు భాగం ఫ్యాన్ లో పడగా చిత్తలు చిత్తలుగా ఊడిపోయింది. రక్తస్రావం జరగడంతో తుంగతుర్తి దవాఖానలో ప్రధమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏది ఏమైనా ఐకెపి సెంటర్లో గాలి మరల వద్ద వడ్లు పడుతున్న వారు జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.