calender_icon.png 4 October, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ దాదా అరెస్ట్

04-10-2025 02:03:55 AM

ఎన్‌జీసీ కమాండోగా విధులు నిర్వ హిస్తూ డ్రగ్స్ రవాణా

200 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : డ్రగ్స్ దాదాగా పేరుగడించిన ఎన్‌ఎస్‌జీ కమాండోను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయి రవాణా చేస్తూ బుధవారం రాత్రి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్‌కు చెందిన బజరంగ్ సింగ్ ఏడేళ్ల పాటు నేషనల్ సెక్యురిటీ గార్డు (ఎన్‌ఎస్‌జీ) కమాండోగా విధులు నిర్వహించాడు. ౨౬/౧౧ ముంబై ఆపరేషన్‌లోనూ పాల్గొన్నాడు. అయితే, అతడికి రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఉండేది. దీంతో అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏర్పర్చుకున్నాడు.

నేరస్తులతో పరిచయాలు ఏర్పర్చుకుని డ్రగ్స్  స్మగ్లింగ్ చేసేవాడు. అతడి తలపై రూ.25వేల రివార్డు ఉంది. రాజస్థాన్‌కు చెందిన యాంటీ నేషనల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడు ఎక్కడికి వెళ్లినా ఒక వంట వాడిని తీసుకెళ్లేవాడని, వంటచేసే వ్యక్తి కదలికలపై నిఘా పెట్టడంతోనే సులువుగా పోలీసులకు చిక్కాడు.