30 June, 2026 | 8:59 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

దుర్గమ్మకు బోనాల ఊరేగింపు

30-09-2025 12:00 AM

ఊరూరా ఘనంగా పూజలందుకుంటున్న దుర్గమ్మ 

పాపన్నపేట, సెప్టెంబర్ 29 : పాపన్నపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండల కేంద్రం పాపన్నపేట తో పాటు యూసఫ్ పేటలో అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పసుపు, కుంకుమ, వేప కొమ్మలు నైవేద్యంతో అందంగా తీర్చిదిద్దిన బోనాలను మహిళలు నెత్తిన పెట్టుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. యువకులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. బోనాల ఊరేగింపులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దుర్గమ్మ నామాస్మరణలతో గ్రామాలు మారుమోగాయి.