30-09-2025 12:00:00 AM
మహిళలకు బతుకమ్మ కానుక చీరల పంపిణీ
జగదేవపూర్, సెప్టెంబర్ 29: ఎన్నికలకు కోడ్ వచ్చింది అంటే నాయకులలో అలజడి మొదలయిందని చెప్పకనే చెప్పవచ్చు. నిన్న, మొన్నటి వరకు రిజర్వేషన్ల కోసం వేచి చుసిన నాయకులు సోమవారం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ చూడగనే ఓట్ల కోసం ప్రజల వద్దకు చేరారు. జగదేవపూర్ మండల కేంద్రంలో మహిళలకు చీరాల పంపిణి చేసి తన ప్రచారం ప్రారంభించారు తాజా మాజీ ఉప సర్పంచ్ బింగి మల్లేశం.
ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గడిచిన 5 సంవత్సరాలుగా ఉప సర్పంచూగ, మండల ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యకులుగా సేవలు అందించినట్లు తెలిపారు. ఈ సారీ ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తే సర్పంచ్ గా సేవ చేస్తానని ఆశ భావం వ్యక్తం చేశారు. గ్రామంలో మహిళలకు బతుకమ్మ పండుగను పూరష్కరించుకుని ఇంటి ఇంటికి తిరుగుతూ చీరల పంపిణి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.