calender_icon.png 17 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాచుపల్లిలో ఘనంగా బోనాలు

28-07-2025 01:15:13 AM

హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం 

కుత్బుల్లాపూర్, జూలై 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో ఆదివారం మైసమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలను హనుమంత్‌రెడ్డి, వీవీఎస్‌ఎన్ చౌదరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బోనాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పారు. ప్రజలకు ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు.