28-07-2025 01:16:24 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండుగను పురస్కరించుకొని నాగోల్‌లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు రావాలని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు నాగోల్‌లో ఉన్న పోచమ్మ ఆలయంలో ఎంపీ ఈటల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలను సందర్శించారు. సాయినగర్ కాలనీ మైసమ్మ, పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో దండిగా వర్షాలు కురవాలని, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరినట్టు చెప్పారు.