28-07-2025 01:14:48 AM
- ఆయన ఓ ఉన్నత శిఖరం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాజకీయాల్లో ఎప్పుడు విలువల విషయంలో రాజీపని వ్యక్తి సూదిని జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఒక ఉన్నత శిఖరమని కొనియా డారు.
ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి జైపాల్‌రెడ్డి అ ని అన్నారు. జైపాల్‌రెడ్డి వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ ప్రతి అంశంపైన అద్భుతమైన వాగ్దాటి, చతురత ఆయన సొం తమన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కేంద్రమంత్రిగా అనునిత్యం ప్రజల కోసమే పనిచేశార న్నారు.
తెలంగాణ రాష్ట్ర సాకారంలో జైపాల్‌రెడ్డి పోషించిన పాత్రను ప్రజలెప్పుడూ మర్చిపోలేదని గుర్తు చేశారు. దక్షిణాది నుం చి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి ఘన త సాధించారని, వారి ఆశయాలను, ఆకాంక్షలను తీసుకుపోవడమే ఆయనకు మన మిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలి
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీ జే అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ముం దుకు సాగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తన జీవతం మొత్తాన్ని దేశ సేవకు అంకితం చేసిన మహాత్ముడని సీఎం అన్నా రు.
కలాం వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిం చారు. విజ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శకంగా నిలిచారని సీఎం కొనియాడారు. కలాం ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ వారి విలువలు, ఆలోచనలను అనుసరిస్తూ స్ఫూర్తితో ముం దుకు సాగాలన్నారు.