14-08-2025 09:45:15 PM
హుజూర్ నగర్: హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్‌గా బండి మోహన్(Sub-Inspector Bandi Mohan) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాబోయే గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండల ప్రజలకు తెలిపారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ ముత్తయ్య నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ కు జూన్ నెలలో బదిలీపై వెళ్ళారు.