14-08-2025 09:44:21 PM
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని ముందస్తుగా కృష్ణాష్టమి(Krishna Janmashtami) జన్మదిన వేడుకలను హంసిని, ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్ లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం అనేది మామూలు విషయం కాదని మా పాఠశాల సంబంధించిన విద్యార్థిని విద్యార్థులతో జరుపుకోవడం ఆనందంగా ఉందని, విద్యార్థులు శ్రీకృష్ణుడి, గోపికల సాంప్రదాయ వేషధారణలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందని, భావితరాలకు మన పండగలను అందించాలని ఈ విధంగా విద్యార్థులతో మమేకమై జరుపుకోవడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొనడం జరిగింది.