calender_icon.png 27 September, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీలకు, స్వీపర్లకు బోనస్, దుస్తులు, ప్రోత్సాహక నగదు అందజేత

27-09-2025 06:36:16 PM

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)లక్ష్మి నారాయణ

గద్వాల: దసరా పండుగను పురస్కరించుకుని హమాలీలకు, స్వీపర్లకు బోనస్, దుస్తులు, ప్రోత్సాహక నగదు అందజేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లక్ష్మి నారాయణ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ చాంబర్ నందు జిల్లా పౌరసరఫరాల శాఖ అధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పౌర సరఫరాల సంస్థ ప్రతి ఏటా ఎమ్మెల్యే పాయింట్స్‌లో హమాలీలు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి బోనస్‌, దుస్తులు అందజేస్తున్నదన్నారు.

జిల్లాలోని 36 హమాలీలకు రూ.7500/- ప్రోత్సాహక నగదు, స్వీట్ బాక్స్ బదులుగా రూ.900/- నగదు, రెండు జతల యూనిఫాం బట్టలు,పంపిణీ చేయడం జరిగిందని .4 స్వీపర్లకు కూడా ఇదే విధంగా ప్రోత్సాహకాలు అందించారు.ప్రతి స్వీపర్‌కు రెండు జతల యూనిఫాం బట్టలు, స్వీపర్లకు కూడా హమాలీలతో సమానంగా రూ. 7500/- ప్రోత్సాహక నగదు, స్వీట్ బాక్స్ బదులుగా రూ.900/- నగదు అందజేశారు.