27-09-2025 06:38:21 PM
కరీంనగర్ (విజయక్రాంతి): నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చౌక్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే చైతన్యపురి కాలనీలో మహాశక్తి దేవాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సునీల్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు.