27-09-2025 06:33:56 PM
కరీంనగర్ (విజయక్రాంతి): ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డా.పొన్నం రవిచంద్ర కోరారు. శనివారం బెంగళూరు సుచిత్ర ఫిలిం సొసైటీలో జరిగిన సౌత్ రీజియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో లాగానే అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించుకోవడానికి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేక ఫిల్మ్ సొసైటీలు మూతపడుతున్నాయని, వాటి మనుగడకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సౌత్ రీజియన్ ఉపాధ్యక్షులు ఎన్. శశిధర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి బి. ప్రకాష్ రెడ్డి, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు నర్వ ప్రకాష్, కఫీసో కార్యదర్శి లక్ష్మీగౌతం, తదితరులు పాల్గొన్నారు.