calender_icon.png 12 November, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ భూములకు త్వరలో హద్దురాళ్ల ఏర్పాటు

12-11-2025 08:13:13 PM

చిట్యాల (విజయక్రాంతి): దేవాలయ భూములకు సంబంధించి త్వరలో నివేదిక సమర్పించి, హద్దురాలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పవన్ కుమార్ తెలిపారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 201లో 102 ఎకరాలలో శ్రీ తిరుమలనాద స్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఈ భూములను పరిరక్షించాలని గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన ప్రముఖులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం దేవాలయ భూములకు సంబంధించి నాలుగు వైపులా ఉన్నటువంటి బౌండరీలను నల్గొండ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

త్వరలోనే నివేదిక సమర్పించి పూర్తిస్థాయిలో మూడు రోజులలో హద్దురాలను ఏర్పాటు చేస్తామని, ఎంతవరకు కబ్జా గురైంది కూడా నివేదికలో సమర్పిస్తామని తెలిపారు. మండల సర్వేయర్ రజినీకాంత్, దేవాలయ అధికారులు బి సుమతి, అంబటి నాగిరెడ్డి, గ్రామ ప్రముఖులు చేకూరి గణేష్ మాదిగ, పొట్లపల్లి చిన్న స్వామి, పొట్లపల్లి సుభాష్, పొట్లపల్లి నరసింహ, పొట్లపల్లి యాదయ్య, మాచర్ల యాదగిరి, పున్న విష్ణు, ఎర్పుల రాకేష్, ఏర్పుల దామోదర్, పొట్లపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.