calender_icon.png 12 November, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల శాంతి ర్యాలీ జయప్రదం చేయాలి

12-11-2025 08:11:58 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ లో గాండ్ల తేలి హక్కుల పోరాట సమితి సంక్షేమ సంఘం భవనంలో బుధవారం రైతు హక్కుల పోరాట సమితి  ముఖ్య నాయకులు  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కో-కన్వీనర్ రేగుంట కేశవ్ రావ్ మాదిగ మాట్లాడుతూ పత్తి రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై  ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి శాంతి ర్యాలీ నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నుట్లు తెలిపారు.

జిల్లాలోని మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, వినతిపత్రాల సమర్పణ, రహదారి దిగ్బంధాలు, కలెక్టరేట్ ముట్టడి, అలాగే సిసిఐ మిల్లుల ఎదుట వేలాది మంది రైతులతో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పత్తి రైతుల హక్కుల కోసం జరగనున్న ఈ శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.